తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు పొందినవారికి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఆగస్టు నుంచే కొత్త రేషన్ కార్డులకు బియ్యం పంపిణీ చేయనున్నట్టుగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
‘రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా రాష్ట్రంలో అర్హులైన సుమారు 3 లక్షల 9 వేల 83 కొత్త కార్డుల్లోని 8.65 లక్షల లబ్దిదారులకు ఆగష్టు నుంచే బియ్యం పంపిణీ చేయనున్నాం. ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం అందజేస్తాం’అని మంత్రి గంగుల తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఆగస్టు నుంచి నవంబర్ వరకు పూర్తి ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్టుగా మంత్రి తెలిపారు. ఇందుకోసం 4 నెలలకు రూ. రూ.92.40 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయన్నట్లు మంత్రి చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఇక, ఆగస్టు 3వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఇక, తెలంగాణలో కొత్తగా కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని.. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అర్హులకు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీచేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)