గురువారం హైదరాబాద్‌లోనూ మోస్తరు వాన పడింది. తార్నాక, నాచారం, ఉప్పల్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్, ఖైరతాబాద్, చిలకలగూడ, ప్యారడైస్, బేగం పేట్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడ్‌పల్లి పలు ప్రాంతాల్లో వర్షంపడింది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ వాతావారణ కేంద్రం గురువారం మధ్యాహ్నం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో శుక్రవారం ఉదయం వరకు అక్కడక్కడ వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)