Telangana Weather: తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్

Telangana Weather: తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి రోజు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. ఐతే ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగనుంది. ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.