వాతావరణ శాఖ సూచనల ప్రకారం రేపు, ఎల్లుండి (19,20) తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ప్రజలు కూడా ఇండ్లలోనే ఉండాలని కోరారు.