Telangana Lockdown: ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారికి అలర్ట్.. ఆ మూడు చెక్‌పోస్టులను మూసివేసిన తెలంగాణ పోలీసులు.. ఎందుకంటే..
Telangana Lockdown: ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారికి అలర్ట్.. ఆ మూడు చెక్‌పోస్టులను మూసివేసిన తెలంగాణ పోలీసులు.. ఎందుకంటే..
లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ నుంచి తెలంగాణలోకి అనవసర రాకపోకలు తగ్గించడమే లక్ష్యంగా మూడు సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా కట్టడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కార్యాకలాపాలకు అనుమతి ఇస్తున్నారు అధికారులు. ఈ సమయం ముగిసిన అనంతరం కర్ఫ్యూ విధిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఉంది. అనంతరం కఠినంగా లాక్ డౌన్ విధిస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకుంటున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
తాజాగా తెలంగాణ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. ఈ పాస్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ శనివారం కీలక ప్రకటన చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
లాక్డౌన్ కు మినహాయింపు ఇచ్చిన సమయంలో కొందరూ అనవసరంగా సరిహద్దులు దాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉదయం సమయంలో రామాపురం ఎక్స్ రోడ్డు చెక్‌పోస్టు నుంచి తెలంగాణలోకి వస్తున్నారన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
ఇలానే జరిగితే కరోనా వైరస్ వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని మొత్తం 4 అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రెడ్లకుంట, చింతలపాలెం, మట్టంపల్లి సరిహద్దులను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
ఈ సరిహద్దుల వద్ద అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద చెక్‌పోస్టు 24 గంటలూ ఉంటుందని వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
అక్కడి నుంచి ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌కు మినహాయింపు ఇచ్చిన సమయంలోనూ ఏపీ నుంచి వచ్చే వాహనదారులకు ఈ-పాస్ ఉండాల్సిందేనని ఎస్పీ స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లింఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.(ప్రతీకాత్మక చిత్రం)