మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మైసమ్మ దేవాలయం దగ్గర కూల్‌డ్రింక్స్ అమ్ముతున్నాడు విజయ్‌కుమార్. మైసమ్మ దేవాలయం దగ్గర పూజా కార్యక్రమానికి ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వచ్చారు. అదే సమయంలో మంత్రిని చూసిన విజయ్‌కుమార్ వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి చేయి పట్టుకొని నన్ను చదివించండి సార్ అంటూ బ్రతిమాలాడు.
అక్కడి నుంచి బాలుడు విజయ్‌కుమార్‌ని తన వాహనంలోని పక్క సీట్లో కూర్చొబెట్టుకున్నారు. బాలుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడు తన తల్లిదండ్రులు మల్లెల వెంకటేష్. బుజ్జమ్మ అని చెప్పాడు. తండ్రి ఆర్థిక పరిస్థితి బాగాలేక బడికి వెళ్లే పరిస్థితి లేకుండాపోయిందని మంత్రికి చెప్పాడు.అందుకే మైసమ్మ గుడి దగ్గర కూల్ డ్రింక్స్ అమ్ముతున్నట్లు మంత్రికి చెప్పాడు.