KTR: సొంత జిల్లా సిరిసిల్లలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. సీఎం అంశంపై స్పందిస్తారా?

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(Kalvakuntla Taraka Rama Rao - KTR) ఈ రోజు ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఇటీవల కేటీఆర్ సీఎం అవుతారని పార్టీలో ప్రచారం జరగడం, ఆదివారం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సిరిసిల్ల పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.