దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. తెలంగాణలోని గత కొన్ని రోజులుగా నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఈ విషయంపై కాస్త ఊరట లభించింది. తాజాగా కేవలం 3,603 కరోనా కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మొన్న రాష్ట్రంలో 4,394 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో ఇద్దరు మరణించారు. (ప్రతీకాత్మక చిత్రం)
మొన్నటి వరకు(జనవరి 22) కరోనాతో రోజుకు 2 లేదా మూడు మరణాలు నమోదయ్యేవి. నిన్న రాష్ట్రంలో కేవలం ఒక కరోనా మరణం మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,072కు చేరింది. రాష్ట్రంలో కరోనా రీకవరీ రేట్ 95.08 శాతంగా ఉంది. తాజాగా రాష్ట్రంలో మరో 2,707 మంది కరోనా నుంచి కోలుకున్నారు.(ఫొటో: ట్విట్టర్)
ఇదిలా ఉంటే రాష్ట్రంలో జర సర్వే ఆదివారం కూడా కొనసాగింది. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి 13,04,227 కుటుంబాలను పరిశీలించారు. ఇందులో కరోనా లక్షణాలు ఉన్న 50, 807 మందిని గుర్తించి వారికి హోం ఐసోలేషన్ కిట్లను గుర్తించారు. అయితే కరోనా కేసుల సంఖ్య 3 వేలకు పడిపోయినా.. జర సర్వేలో వేల సంఖ్యలో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.(ప్రతీకాత్మక చిత్రం)