తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ టైం టేబుల్ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గతేడాది కరోనా కారణంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేసిన ఇంటర్ బోర్డు.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే సెకండియర్ లోకి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. (ఇంటర్ బోర్డు లోగో- ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో ఇటీవల ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను నిర్వహించింది ఇంటర్ బోర్డు. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆ పరీక్షలు సంబంధించిన మూల్యాంకనం నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు మాత్రమే పూర్తి స్థాయిలో మూల్యాంకనానికి పూర్తి స్థాయిలో హాజరవుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రైవేటు కాలేజీల నుంచి మాత్రం అధ్యాపకులు మూల్యాంకనానికి సరిగా హాజరవడం లేదు. దీంతో మూల్యాంకనం ఆశించినంత వేగంగా జరగడం లేదు. దీంతో మూల్యాంకనం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పరీక్షలు, మూల్యంకనం కారణంగా ఆయా విధులకు హాజరవుతున్న అధ్యాపకులు పని చేసే కాలేజీల్లో తరగతులు జరగడం లేదు.(ప్రతీకాత్మక చిత్రం)
దీంతో సిలబస్ షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యే అవకాశం లేదని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ టైం టేబుల్ లో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ గతంలో వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)