ఒక్కసారి ఊహించుకోండి.. ఇప్పుడు మనం తిరిగే ప్రదేశాల్లో ఒకప్పుడు డైనోసార్లు తిరిగేవంటే.. ఆ ఊహ ఎలా ఉంటుంది? అప్పట్లో మన తెలుగు రాష్ట్రాలతోపాటూ... భూమిపై ఎక్కడా మనుషులు లేరు. భవనాలు, కార్లు ఏవీ లేవు. ఉన్నదల్లా నదులు, అడవులే. ఆ కాలంలో డైనోసార్లు స్వేచ్ఛగా తిరిగేవి. ఆరున్నర కోట్ల సంవత్సరాల కిందట అవి.. ఉల్కాపాతం వల్ల చనిపోయాయనే అంచనా ఉంది. ఐతే.. వాటి శిలాజాలు.. భారత్ సహా చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి. తాజాగా ప్రాణహిత నది తీర ప్రాంతంలో ఇవి కనిపించాయి.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ డైనోసార్లపై దృష్టి సారించింది. ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతంలో అడ్వెంచర్ టూరిజంని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పర్యాటక శాఖ, అటవీ శాఖ కలిసి ప్లాన్ రెడీ చేస్తున్నాయి. " width="1920" height="1440" /> టూరిజంపై ఎక్కువ ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ డైనోసార్లపై దృష్టి సారించింది. ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతంలో అడ్వెంచర్ టూరిజంని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పర్యాటక శాఖ, అటవీ శాఖ కలిసి ప్లాన్ రెడీ చేస్తున్నాయి.
పూర్వకాలంలో నదీ పరీవాహక ప్రాంతాల్లోనే డైనోసార్లు ఎక్కువగా జీవించినట్లు ఆధారాలున్నాయి. నదుల్లో చేపలు ఇతర ఆహారంతోపాటూ... పక్కనే ఉన్న అడవుల్లో జంతువుల్ని తింటూ అవి బతికేవనే అంచనా ఉంది. ఈ క్రమంలో ప్రాణహిత నది.. రాక్షస బల్లులకు ప్రాణం ఇచ్చింది. అవి అంతరించిపోకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు ఇండియా అంతటా డైనోసార్లు ఉండేవంటున్నారు శాస్త్రవేత్తలు.