ST Students: ఎస్టీ విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఇకపై వాళ్లకు ఆ దిగులే ఉండదు..

ఆన్‌లైన్ తరగతులకు అనువైన పరిస్థితులు లేని, ఆ సదుపాయాలు అందుబాటులో లేని గిరిజన విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ‘గిరి దర్శిని’ వర్క్‌షీట్లను రూపొందించింది. ‘గిరి దర్శిని’ అభ్యాసిక పేరుతో గిరిజన విద్యార్థులు ఇంటి వద్దే సాధన చేసేలా పాఠ్య పుస్తకాలను పంపించాలని నిర్ణయించింది.