Telangana Students: విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. కీలక ఉత్తర్వులు జారీ.. వివరాలివే
Telangana Students: విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. కీలక ఉత్తర్వులు జారీ.. వివరాలివే
కరోనా(Corona) నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంస్థలు ఆలస్యంగా ప్రారంభమవుతుండడంతో తెలంగాణ సర్కార్(Telangana Government) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల్లో ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. విద్యంస్థలు కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు నష్టపోకుండా కీలక నిర్ణయం తీసుకుంది.ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు అందించే స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు అక్టోబర్ 24తో ముగిసింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
అయితే.. అనేక మంది విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోలేకపోయారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
దీంతో ఆ గడువును జనవరి 31 వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
6/ 8
ఇంకా బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)