తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
అదే రోజు అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు పున:ప్రారంభించాలని నిర్ణయించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
కేజీ నుంచి పీజీ దాకా అన్ని విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
రాష్ట్రంలోని కరోనా నియంత్రణలోకి వచ్చిందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
విద్యార్థులకు జ్వరం వస్తే వెంటనే పీహెచ్సీ సెంటర్లకు పంపాలని సీఎం కేసీఆర్ సూచించారు.
6/ 9
కోవిడ్ నిర్ధారణ అయితే విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సీఎం కేసీఆర్ సూచన.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
స్కూల్స్ మూసేయడం వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఈ నెల 30లోపు తరగతి గదులు, హాస్టళ్లను శానిటైజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
ప్రైవేటు స్కూల్ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న తరుణంలో రాష్ట్రంలోనూ విద్యాసంస్థలు తెరవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.(ప్రతీకాత్మక చిత్రం)