తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకున్న తొలి స్వలింగ సంపర్కులు వీరే కావడం విశేషం. వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత, ఈ జంట ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌ను విచారించింది
సుప్రియో, అభయ్ ఒకరినొకరు పిలుచుకోవడానికి భార్య లేదా భర్తకు బదులుగా భాగస్వామి అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తారో వివరించారు. భాగస్వామి అనే పదం మా సంబంధానికి న్యాయం చేయదు. మా దృష్టిలో, మేము ఇతర వివాహిత జంటల మాదిరిగానే ఉంటాం. అందువల్ల మా సంబంధం యొక్క నిజమైన స్వభావాన్ని చట్టం గుర్తించాలని మేము కోరుకుంటున్నామని సుప్రియో వివరించారు.
చట్టపరమైన గుర్తింపు లేకపోవడం అనేక సమస్యలుఇల్లు అభయ్ పేరు మీద ఉన్నందున సుప్రియోకి ఇంటి చిరునామాను పొందడం చాలా కష్టమైంది. వ్యతిరేక లింగ జంటలు అలాంటి సమస్యను ఎదుర్కొనేవారు కాదు. అదనంగా, మేము ఒకే ఆరోగ్య బీమాకు బదులుగా రెండు వేర్వేరు ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయాల్సి వచ్చిందని సుప్రియో చెప్పారు.