Telangana: కొత్త బార్లకు దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..
Telangana: కొత్త బార్లకు దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..
Telangana: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు కానున్న బార్లకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఐతే మరిన్ని దరఖాస్తులు రావచ్చని భావిస్తున్న ప్రభుత్వం.. దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించింది.
తెలంగాణలో కొత్తగా ఏర్పాటు కానున్న బార్లకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఐతే మరిన్ని దరఖాస్తులు రావచ్చని భావిస్తున్న ప్రభుత్వం.. దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించింది.
2/ 6
ఫిబ్రవరి 16వ వరకు దరఖాస్తులు స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
3/ 6
తెలంగాణలో కొత్తగా 159 బార్ల కోసం ముందుగా ఈ నెల 8 వరకు దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం 7,360 దరఖాస్తు వచ్చాయి. చివరి రోజైన సోమవారం ఒక్కరోజే ఏకంగా 5,311 దరఖాస్తులు వచ్చాయి.
4/ 6
అధికారుల అంచనాలకు మించి దరఖాస్తులు రావడంతో గడువును పెంచారు. మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావించి గడువు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.
5/ 6
మొదట నిర్దేశించిన గుడువులోగా ప్రభుత్వానికి దరఖాస్తు రుసుం కింద రూ.73.60 కోట్ల ఆదాయం సమకూరింది. తాజాగా గడువు పొడిగించడంతో మొత్తంగా రూ. 130 కోట్ల మేర ఆదాయం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
6/ 6
ఫిబ్రవరి 18న పురపాలక సంఘాల పరిధిలో, ఫిబ్రవరి 19న జీహెచ్ఎంసీ పరిధిలో లాటరీ విధానంలో బార్ల లైసెన్స్దారులను ఎంపిక చేయనున్నారు.