TELANGANA EDUCATION MINISTER SABITHA REDDY IMPORTANT ANNOUNCEMENT OVER INTER FIRST YEAR EXAMS NS
Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు అలర్ట్.. త్వరలోనే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయన్న మంత్రి
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కీలక ప్రకటన చేశారు. వీరికి త్వరలోనే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో కరోనా నేపథ్యంలో ఇంటర్ టెన్త్, ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.(మంత్రి సబితారెడ్డి -ఫైల్ ఫొటో)
2/ 9
అయితే.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మాత్రం ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
దీంతో.. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఇక ఉండవని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై రాష్ట్ర విద్యాశఖ మంత్రి సబితారెడ్డి క్లారిటీ ఇచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
సెకండియర్ కు ప్రమోట్ అయిన విద్యార్థులంతా మళ్లీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాల్సిందేనని స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
పరీక్షలను ఎప్పుడు నిర్వహించే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
ఒక వేళ కరోనా కేసులు విజృంభించి మళ్లీ సెకండియర్ పరీక్షలను రద్దు చేయాల్సి వస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగానే అప్పుడు మార్కులు కేటాయించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను నిర్వహించాలన్నది సర్కార్ ఆలోచనగా సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులను సైతం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటే మంచిది.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
లేక పోతే ప్రభుత్వం అకస్మాత్తుగా ఎగ్జామ్స్ తేదీలను ప్రకటిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)