corona : గాంధీలో కొత్త ఆక్సిజన్ ప్లాంట్ ..పనితీరును పరిశీలించిన సీఎస్
corona : గాంధీలో కొత్త ఆక్సిజన్ ప్లాంట్ ..పనితీరును పరిశీలించిన సీఎస్
corona visit : ముఖ్యమంత్రి కేసిఆర్ వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై మరింత భారం పెరిగింది. కొవిడ్ భాధితులకు సంబంధించిన సౌకర్యాలు, ఆసుపత్రుల మెరుగుతో పాటు వాటి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే నేడు గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.
1/ 5
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ శుక్రవారం గాంధీ ఆసుపత్రిని దర్శించారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి నందు అందిస్తున్న చికిత్స సదుపాయాలను ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. తదుపరి ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు.
2/ 5
రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటకై Cleanliness drive కింద చేపట్టిన పారిశుధ్యం, వీధి దీపాలు, ఆక్సిజన్ పైప్లైన్ పనులను ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు.
3/ 5
లైబ్రరీ భవనంలో కోవిడ్ రోగుల కోసం 160 అదనపు పడకలతో సిద్ధం చేసిన కొత్త వార్డును ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. ఇది త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు.
4/ 5
రోజుకు 4 మెట్రిక్ టన్నుల సామర్ద్యంతో నెలకొల్పి, నేటి నుండి పనిచేస్తున్న కొత్త ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ను ప్రధాన కార్యదర్శి తనిఖీ చేసారు. ఈ కొత్త ఆక్సిజన్ ప్లాంట్ 400 మంది పేషంట్లకు సరిపడ ఆక్సిజన్ ను అందిస్తుంది.
5/ 5
కరోనా రోగులకు అందుతున్న సౌకర్యాలు, ఇతర మందులతో పాటు పరిసరాలను పరిశీలించారు