TELANGANA COVID 19 STATUS BULLETIN TOTAL 2707 NEW CASES AND 2 DEATHS REPORTED ON JAN 13 NS
Telangana Corona: తెలంగాణలో తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే?
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. మళ్లీ కేసుల సంఖ్య పెరగడం, మరణాల నమోదు ఆగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెల 10న 1825 కేసులు మాత్రమే నమోదు కావడంతో కేసుల సంఖ్య ఇక తగ్గుముఖం పడుతుందని అంతా భావించారు. కానీ గత రెండు రోజులు కేసుల సంఖ్య భారీగా పెరగడం మళ్లీ ఆందోళన పెంచుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ నెల 12న 2,319 కేసులు నమోదైనట్లు అధికారులు బులిటెన్ లో పేర్కొన్నారు. అయితే బుధవారం అంటే ఈ నెల 13న 2,707 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు మరో రెండు మరణాలు కూడా నమోదయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
నమోదైన అత్యధిక కేసుల్లో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 1328 కేసులు నమోదయ్యాయి. ఇంకా జీహెచ్ఎంసీ ఆనుకుని ఉండే రంగారెడ్డి జిల్లాలో 202 కేసులు, మేడ్చల్ జిల్లాలో 248 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 78 కేసులు నమోదయ్యాయి.(ఫొటో: ట్విట్టర్)
4/ 6
ఇంకా ఇతర జిల్లాలను పరిశీలిస్తే.. మంచిర్యాల జిల్లాలో 58, ఖమ్మం జిల్లాలో 56, నిజామాబాద్ జిల్లాలో 60, మహబూబాబాద్ లో 44, పెద్దపల్లిలో 52 కేసులు నమోదయ్యాయి. (ఫొటో: ట్విట్టర్)
5/ 6
మొన్నటి వరకు సున్నా కేసులు నమోదైన ములుగు జిల్లాలోనూ ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఇక్కడ 8 కేసులు నమోదయ్యాయి. నిన్న ఐదు, మొన్న 7 కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ గతంలో అత్యల్పంగా కేసుల నమోదు సంఖ్య ఉండేది. కానీ తాజాగా ఇక్కడ సైతం 6 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఇదిలా ఉంటే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,049కి చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 96.51 శాతంగా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)