తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్నీ వరుస పరాజయాలనే మూట కట్టుకుంటోంది. అయినా.. ఆ పార్టీలో కొందరు నేతలు మాత్రం ఎల్లప్పూడు పార్టీ వాయిస్ ను ఏమాత్రం తగ్గకుండా జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అందులో ముందు వరుసలో ఉంటారు అద్దంకి దయాకర్. టీపీసీసీ అధికార ప్రతినిధి అయిన అద్దంకి దయాకర్ టీవీ చర్చలు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా వేధికల ద్వారా ఎల్లప్పుడూ పార్టీ గొంతును వినిపిస్తూ ఉంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
దీంతో రాజకీయలను పరిశీలించే ప్రతీ ఒక్కరికీ అద్దంకి దయాకర్ పేరు సుపరిచతమే. అయితే ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సినీ హీరోగా మారనున్నారు. బొమ్మక్ మురళి అద్దంకి దయాకర్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగానే కనిపిస్తుండడం విశేషం. ఆయన పాత్ర పేరు కూడా అద్దంకి దయాకర్ కావడం మరో విశేషం.(ఫొటో: ట్విట్టర్)
ఈ సినిమాలో అద్దంకితో పాటు ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా కలిసి నటిస్తున్నారు. అద్దంకి భార్యగా ప్రముఖ సినీ నటి ఇంద్రజ నటిస్తున్నారు. మరో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే.. ఈ సినిమా తన సెమీ బయోపిక్ గా ఉంటుందని అద్దంకి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.(ఫొటో: ట్విట్టర్)
అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతల అనుమతితో గాంధీ భవన్ లో కూడా చిత్రించారు. అద్దంకి దయాకర్ ప్రెస్ తో మాట్లాడే సన్నివేశాలను ఇటీవల గాంధీభవన్ లో చిత్రీకరించారు. అయితే ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే పేర్లను పరిశీలిస్తున్నారని అద్దంకి తెలిపారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రస్తుతం నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరుకు షూటింగ్ పార్ట్ పూర్తవుతుందన్నారు.(ఫొటో: ట్విట్టర్)
ఇదిలా ఉంటే అద్దంకి దయాకర్ మాల మహానాడుకు వ్యవస్థాపక అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన చురుకైన పాత్ర పోషించారు. టీజేఏసీ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2014 ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతూర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు.(ఫొటో: ట్విట్టర్)
అనంతరం 2018లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా తుంగతూర్తి నుంచి పోటీ చేసి మళ్లీ 2 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. మరో సారి తుంగతూర్తి నుంచచే పోటీ చేసి మూడో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అద్దంకి దయకార్ భావిస్తున్నారు. అయితే తుంగతూర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు ఆయనకు తలనొప్పిగా మారాయి.(ఫొటో: ట్విట్టర్)