Telangana Budget 2023-24: బడ్జెట్ లో రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్..రుణమాఫీ, రైతుబంధు, రైతుభీమాకు భారీగా నిధులు
Telangana Budget 2023-24: బడ్జెట్ లో రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్..రుణమాఫీ, రైతుబంధు, రైతుభీమాకు భారీగా నిధులు
బడ్జెట్ లో తెలంగాణ రైతులకు సర్కార్ తీపికబురు చెప్పింది. రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రుణమాఫీపై ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈసారి రుణమాఫీకి భారీగా నిధులు కేటాయించింది. అలాగే వ్యవసాయ రంగంతో పాటు రైతుబంధు, రైతుభీమాకు కూడా నిధులు భారీగా కేటాయించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బడ్జెట్ లో తెలంగాణ రైతులకు సర్కార్ తీపికబురు చెప్పింది. రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రుణమాఫీపై ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
2/ 8
ఈసారి రుణమాఫీకి భారీగా నిధులు కేటాయించింది. అలాగే వ్యవసాయ రంగంతో పాటు రైతుబంధు, రైతుభీమాకు కూడా నిధులు భారీగా కేటాయించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
3/ 8
కాగా గత ఎన్నికల సమయంలో రూ. లక్ష లోపు రుణాళ్లన్నింటిని మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు కేవలం రూ. 50 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేయగా రైతుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
4/ 8
ఈ క్రమంలో ఈసారి రూ. లక్ష వరకు రుణమాఫీ చేసేలా భారీగా నిధులను కేటాయించింది. కేవలం రుణమాఫీ కోసం ఏకంగా రూ.6385 కోట్లు కేటాయించినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు.
5/ 8
అయితే గత బడ్జెట్ లో రూ. 50 వేల వరకు రుణమాఫీ కోసం నిధులు కేటాయించగా..తాజా కేటాయింపులో భారీగా నిధులు కేటాయించడంతో రూ. లక్ష వరకు ఉన్న రుణాలన్నీ కూడా త్వరలోనే మాఫీ కానున్నాయి.
6/ 8
ఇక వ్యవసాయ సంగంతో పాటు రైతుబంధు, రైతుభీమాకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు కేటాయించగా.. నీటి పారుదల శాఖకు రూ.26,885 కోట్లు, రైతుబంధుకు రూ.1575 కోట్లు, రైతుభీమాకు రూ. 1589 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
7/ 8
వడ్డీ లేని రుణాల కోసం రూ.150 కోట్లు, ఆయిల్ ఫామ్ సాగు కోసం రూ. వెయ్యి కోట్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం రూ.3,117 కోట్ల నిధులు కేటాయించారు.
8/ 8
రుణమాఫీపై రైతులు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ నిధుల కేటాయింపుతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ లో రైతుల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించింది ప్రభుత్వం.