Bandi Sanjay: కవితపై బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్..ఢిల్లీలో అంతా రెడీ అవుతుందంటూ..
Bandi Sanjay: కవితపై బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్..ఢిల్లీలో అంతా రెడీ అవుతుందంటూ..
Bandi Sanjay: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) ఈడీ విచారణలో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి బండి సంజయ్ (Bandi Sanjay) కవితపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) ఈడీ విచారణలో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి బండి సంజయ్ (Bandi Sanjay) కవితపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2/ 6
TSPSC పేపర్ లీక్ తో ఆ కార్యాలయం వద్ద బీజేవైఎం నాయకులు నిన్న ఆందోళన చేశారు. దీనితో వారిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.
3/ 6
ఇవాళ వీరిని బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ..రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలను జైలుకు పంపడం సర్వసాధారణమైపోయింది. తాము భయపడే వ్యక్తులం కాదని అన్నారు.
4/ 6
కేసీఆర్ మేం బయపడుతామని అనుకుంటుండు. కానీ మేము భయపడం. ఎన్ని జైళ్లయినా రెడీ చెయ్. అన్ని జిల్లాల్లో రూమ్ లు రెడీ చేయండి. ఆడ కూడా నీ బిడ్డకు రెడీ అవుతుంది కదా అని కవితను ఉద్దేశించి బండి సంజయ్ వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
5/ 6
కాగా లిక్కర్ స్కాంలో నేడు కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ అనారోగ్య కారణాల వల్ల విచారణకు రాలేనని కవిత ఈడీకి లేఖ రాసింది.
6/ 6
అయితే కవిత లేఖపై ఈడీ రిప్లై ఇవ్వలేదు. దీనితో కవిత ఈడీ విచారణపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ బండి సంజయ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.