పిల్లలకు 21వ రోజు నామకరణం చేయడం సాధారణంగా మనం చూస్తుంటాం. కానీ ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకు పుట్టిన పిల్లలకు కుటుంబ సభ్యుల, బంధువుల, స్నేహితుల మధ్య పెంపుడు కుక్క కు పుట్టిన పిల్లలకు బారసాల చేసింది.
2/ 5
ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది.
3/ 5
సుల్తానాబాద్‌కు చెందిన సాదుల కరుణాకర్ , పద్మ దంపతులు ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల అది ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది.ఈ క్రమంలోనే వాటికి బారసాల నిర్వహించి ముద్దు పేర్లు పెట్టారు.
4/ 5
కుటుంబ సభ్యులు , బంధువులతో కలిసి బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈవిషయం ఆనోటా ఈనోటా పడడంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
5/ 5
కుక్క పిల్లలకు బారసాల చేసిన కరుణాకర్ కుటుంబాన్ని అభినందిస్తున్నారు జంతు ప్రేమికులు.