హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..గవర్నర్ తమిళిసై ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ!

మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..గవర్నర్ తమిళిసై ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ!

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనసభ, శాసనమండలి సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం ఉండనుంది. అయితే గత కొంతకాలంగా సర్కార్ కు, గవర్నర్ కు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఏం మాట్లాడబోతున్నారు? ప్రభుత్వం ఇచ్చిన కాపీని చదువుతారా? లేక తన సొంత ప్రసంగాన్ని జోడిస్తారా? సొంత ప్రసంగం జోడిస్తే బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇలా ఎన్నో ప్రశ్నల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Top Stories