Aasara pensions: 57 ఏళ్లు దాటితే వృద్ధాప్య పింఛన్.. రేపటి నుంచే దరఖాస్తులు.. ఇలా అప్లై చేయండి
Aasara pensions: 57 ఏళ్లు దాటితే వృద్ధాప్య పింఛన్.. రేపటి నుంచే దరఖాస్తులు.. ఇలా అప్లై చేయండి
Aasara Pensions: మీ ఇంట్లో ఎవరికైనా 57 ఏళ్లు నిండాయా? వారికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్ ఇస్తోంది. మరి మీ కుటుంబ సభ్యులు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఐతే వెంటనే చేయండి. తెలంగాణలో 57 ఏళ్ల వృద్ధాప్య పింఛన్లకు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించున్నారు.
తెలంగాణలో 57 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని ‘మీ’సేవా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులను తీసుకుంటారు. వృద్ధాప్య పించన్ల వయసును 57ఏళ్లకు తగ్గించినా, చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేదని అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.
3/ 8
వారందరికీ పింఛన్లు అందుతాయని సీఎం కేసీఆర్ సభావేదికగా హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో శనివారం సమీక్ష నిర్వహించిన సీఎస్ సోమేష్ కుమార్.. దరఖాస్తు తేదీలను పొడిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
4/ 8
ఆసరా పెన్షన్ పథకంలో భాగంగా 57 ఏళ్లు నిండిన వారందరికీ రూ.2,116 వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 57 ఏళ్లు నిండినవారు ఆసరాకు అర్హులు. ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు మించి ఉండకూడదు. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా పెన్షన్ రాదు.. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి ఉన్నవారు ఆసరా పెన్షన్‌కు అనర్హులు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరా పెన్షన్లు ఇవ్వరు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
అంతేకాదు .. తమ పేరిట హెవీ వెహికిల్స్ ఉన్నా, ఐటీ రిటర్నులు దాఖలు చేసినా పెన్షన్ పథకం వర్తంచదు. లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులై ఉండరాదు. 57 ఏళ్లు నిండి, ప్రభుత్వం సూచించిన అన్ని అర్హతలు కలిగిన వారికే పెన్షన్ ఇస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
తెలంగాణలో వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ.2,116 పెన్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. దివ్యాంగులకు రూ.3,116 ను అందిస్తున్నారు.