TS Corona : గురుకుల పాఠశాలలో కరోనా కల్లోలం 27 మందికి పాజిటివ్
TS Corona : గురుకుల పాఠశాలలో కరోనా కల్లోలం 27 మందికి పాజిటివ్
TS Corona : తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో మరోసారి కరోనా విజృంభించింది. ఖమ్మంలోని గురుకుల స్కూళ్లో ఏకంగా 27 మందికి కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో స్కూళు పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళణ నెలకొంది.
తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలతో పాటు కాలేజీల్లో మరోసాకి కరోనా కలకలం రేగింది. గురుకుల పాఠశాలలో 13 మందికి కాలేజీలో మరో 14 మందికి కరోనా పాజీటివ్‌గా తేలింది.
2/ 5
ఇలా మొత్తం ఒకేసారి 27 మందికి కరోనా సోకడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన మొదలైంది. కాగా ఇటివల ఇంటికి వెళ్లివచ్చిన ఓ విద్యార్థిని అనారోగ్యంతో ఉండడంతో ఆమె కరోనా పరీక్షలు నిర్వహించారు.
3/ 5
దీంతో ఆమెకు కరోనా పాజిటీవ్‌గా తేలింది. దీంతో ప్రిన్సిపల్ లక్ష్మి విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా 27మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. ఫలితంగా కరోనా బారిన పడిన వారందరినీ ఇళ్లకు పంపించారు.
4/ 5
ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఇళ్లకు తీసుకెళుతున్నారు. కాగా మొత్తం 650 మంది విద్యార్థినిలు ఉన్నట్టు తెలుస్తోంది.
5/ 5
ఇటివల నల్గొండ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కూడా 25 మంది విద్యార్థులకు గత వారం రోజుల క్రితమే పాజిటివ్‌గా తేలింది. జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది.