స్వామివారు కొండ గుహలో భక్తవత్సలుడుగా కొలువై ఉంటాడు. అందుకే భక్తులు గుండ్లపై ఉన్న స్వామివారిని దర్శించుకుని తప్పనిసరిగా క్షీరాభిషేకం చేస్తారు. భక్తుల కోరికలు నెరవేర్చే భోళా శంకరుడిగా, సంతానం ప్రసాదించే సంతానేశ్వరుడిగా పేరుగాంచిన ఆ ముక్కోటి ని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
లింగ ప్రతిష్టాపనలో భాగంగా పరశురాముడు వేల సంత్సరాలు తపస్సు చేస్తాడు. ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడై.. లింగం మీద గొడ్డలితో ఒక దెబ్బ వేస్తాడు. భక్తుడి కోరిక మేరకు శివుడు ప్రత్యక్షమై.. కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తానని హామీ ఇచ్చాడని.. అనంతరం పరుశురాముడు అక్కడే శివైక్యం చెందాడని పురాణాలు చెబుతున్నాయి.