Monsoon: తెలంగాణలో ప్రవేశించిన రుతుపవనాలు.. మూడు రోజులు పాటు వర్షాలు
Monsoon: తెలంగాణలో ప్రవేశించిన రుతుపవనాలు.. మూడు రోజులు పాటు వర్షాలు
Monsoon Rains: రైతన్నలకు చల్లటి కబురు ఇది. తెలంగాణలోకి నైరుతి పవనాలు వచ్చేశాయి. రెండు రోజుల క్రితం కేరళను తాకిన రుతుపవనాలు.. నేటి రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాగల 24 గంటల్లో రాష్ట్రమంతటా నైరుతి రుతుపవానలు విస్తరిస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. వీటి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ ఏడాది సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. మన దేశంలో గత రెండేళ్లుగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
రుతుపవనాల రాకతో మనదేశంలో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. వీటి ప్రభావంతో జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్లో విస్తారంగా వానలు కురుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
మన దేశం వ్యవసాయ రంగం వర్షాలపైనే ఆధారపడి ఉంది. సగానికి పైగా భూములను వర్షా కాలంలోనే సాగు చేస్తారు. ప్రధానంగా ఈ నైరుతి రుతవపనాల మీద ఆధారపడే పంటలను పండిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ సారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని.. వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణశాఖ చెప్పడంతో రైతుల సంతోషపడుతున్నారు. పంటలు బాగా పండాలని కోరుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)