SOUTH CENTRAL RAILWAY TO OPERATE 15 MORE SPECIAL TRAINS FROM SECUNDERABAD HYDERABAD AND KACHEGUDA TO NEW DELHI BENGALURU CHENNAI SS
Special Trains: హైదరాబాద్ నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు... రూట్స్ ఇవే
Special Trains | రైలు ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ప్రయాణికులకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అన్‌లాక్ 4.0 లో భాగంగా భారతీయ రైల్వే మరిన్ని స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. ఏఏ రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయో తెలుసుకోండి.
1. అన్‌లాక్ 4.0 లో భాగంగా మరిన్ని స్పెషల్ ట్రైన్స్ నడపనుంది భారతీయ రైల్వే. దేశవ్యాప్తంగా 120 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. ఇప్పటికే భారతీయ రైల్వే 230 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వాటితో పాటు కొత్తగా 120 స్పెషల్ ట్రైన్స్‌ని ప్రయాణికులు ఉపయోగించుకోవచ్చు. వీటిని నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే అధికారులు సంప్రదిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి 22 ప్రత్యేక రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి న్యూ ఢిల్లీ, ముంబై, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హౌరా, దానాపూర్ రూట్లలో ఈ రైళ్లు నడుస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో హైదరాబాద్ నుంచి రోజూ 25,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండటం విశేషం. మొదట్లో ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉండేది కాదు. కానీ క్రమంగా వెయిటింగ్ లిస్ట్ పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
5. భారతీయ రైల్వే నడపబోయే 120 స్పెషల్ ట్రైన్స్‌లో భాగంగా మరో 15 రైళ్లు అందుబాటులోకి వస్తాయి. సికింద్రాబాద్ నుంచి న్యూ ఢిల్లీకి, హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడిచే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. ఇక రద్దీ ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్-పాట్నా, సికింద్రాబాద్-హౌరా రూట్లలో కూడా కొత్తగా స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి రావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. సికింద్రాబాద్-చెన్నై రూట్లో కూడా స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి రావొచ్చు. ఇప్పటివరకు ఈ రూట్లో ప్రత్యేక రైలు నడవట్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. ఇక కాచిగూడ స్టేషన్ నుంచి మళ్లీ రాకపోకలు పునరుద్ధరించే పరిస్థితి ఉంది. కాచిగూడ-బెంగళూరు రూట్లో స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. ఇక హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7న మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. ఎక్కువగా కాకపోయినా ఒకట్రెండు ఎంఎంటీఎస్ రైళ్లు నడవొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)