1. దక్షిణ మధ్య రైల్వే వరుసగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. గతంలో ప్రకటించిన నవంబర్ 30 వరకే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే... వాటిని మరికొంత కాలం పొడిగించింది. వీటితో పాటు మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటిస్తోంది. అందులో షిర్డీ-సికింద్రాబాద్, షిర్డీ-కాకినాడ రైళ్లు కూడా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 07002 సికింద్రాబాద్-షిర్డీ మధ్య నడుస్తుంది. డిసెంబర్ 4 నుంచి ప్రతీ శుక్రవారం, ఆదివారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4.25 గంటలకు రైలు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో సికింద్రాబాద్ జంక్షన్, బేగంపేట్, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్ జంక్షన్, జహీరాబాద్లో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైలు నెంబర్ 07001 షిర్డీ-సికింద్రాబాద్ మధ్య నడుస్తుంది. ఈ రైలు డిసెంబర్ 5 నుంచి ప్రతీ శనివారం, సోమవారం అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 5.20 గంటలకు సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషన్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జహీరాబాద్, వికారాబాద్ జంక్షన్, శంకర్పల్లి, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్ జంక్షన్లో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక రైలు నెంబర్ 07206 కాకినాడ-షిర్డీ మధ్య రైలు నడుస్తుంది. డిసెంబర్ 5 నుంచి ప్రతీ శనివారం, సోమవారం, బుధవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 గంటలకు కాకినాడలో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ రైలు కాకినాడ పోర్ట్, కాకినాడ టౌన్, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ జంక్షన్, మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్ జంక్షన్, జహీరాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రైలు నెంబర్ 07205 షిర్డీ-కాకినాడ మధ్య రైలు నడుస్తుంది. డిసెంబర్ 6 నుంచి ఈ రైలు ప్రతీ ఆదివారం, మంగళవారం, గురువారం అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 5.20 గంటలకు రైలు సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషన్లో బయల్దేరి మరుసటి రోజు రాత్రి 7.45 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. జహీరాబాద్, వికారాబాద్ జంక్షన్, శంకరపల్లి, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్ జంక్షన్, కాజీపేట జంక్షన్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)