దక్షిణ మధ్య రైల్వేకు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంజూరయిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. సికింద్రాబాద్-విజయవాడ రైల్వేస్టేషన్ మధ్య ఈ రైలు నడుస్తుంది. మనదేశంలో ఇప్పటి వరకు ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించగా.. ఇది ఆరవది కావడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గరిష్ట వేగం గంటకు 180 కి.మీ. ఐతే సికింద్రాబాద్-విజయవాడ మధ్య కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్ గరిష్ట వేగ సామర్థ్యం గంటకు 130 కి.మీ. వందే భారత్ రైలు కోసం ఈ ట్రాక్ సామర్థ్యాన్ని 180 కి.మీ. వరకు పెంచాల్సి ఉంటుంది. డిసెంబరులోనే ఇది పూర్తవుతుంది. ఆ తర్వాత వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
దక్షిణ మధ్య రైల్వేకు వందే భారత్ రైలు మంజూరవడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతో చొరవ చూపారు. ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఆయన.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, విశాఖపట్టణానికి వందే భారత్ రైళ్లు నడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 3 రోజుల క్రితం కూడా మరోసారి ఆయనతో చర్చలు జరిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూర్చోవడానికి మాత్రమే సీట్లుంటాయి. అందువల్ల ప్రస్తుతానికి సికింద్రాబాద్-విజయవాడే మధ్యే ఈ రైలును నడుపుతామని అశ్వినీ వైష్ణవ్..కిషన్ రెడ్డికి తెలిపారు. బెర్త్‌లతో కూడిన రైళ్లు వచ్చాక.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు పొడిగిస్తామని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీ నగర్, మైసూర్-చెన్నై రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైళ్లను ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశాలున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)