Sonusood: సోనూసూద్‌ను కలిసిన బుల్లి సోనాలీసూద్‌.. అక్కడ నుంచి వచ్చామని ఆ భార్యాభర్త చెప్పగానే..

సోనూసూద్‌. వెండితెర విలన్‌. కానీ నిజ జీవిత హీరో. కోవిడ్ 19 కరోనా సృష్టించిన విలయంలో మానవత్వం చాటుకున్న విలక్షణ నటుడు. ఎందరో జీవితాలను అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి కరోనా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న చిన్న, సన్న కారు జీవితాలకు ఆపన్న హస్తం అందించిన మహోన్నత వ్యక్తిత్తం సోనూసూద్‌ది. దినసరి కూలీలకు ఆహారం సరఫరా చేసినా.. ఉండడానికి ఆసరా లేని వేలాది మందికి తన హోటల్‌నే ఆశ్రయంగా మార్చినా..