తమ స్తలం ఇవ్వాలని బెదిరిస్తున్న వారితో తమకు ప్రాణహాని పొంచి ఉందంటున్నారు బాధితులు. స్తలం ఇవ్వకపోతే చంపుతామని బెదిరిస్తున్న గ్రామానికి చెందిన కొందరిపై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుడారాల దగ్గరే పిల్లలు, మహిళలు వండుకోవడం, తినడం, నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. ఈ ఆరు కుటుంబాలకు గ్రామస్తుల నుంచి రక్షణ కల్పించి వారి పొలాన్ని కబ్జాకి గురి కాకుండా చూడాలని ..ఈ గుడారం నుంచి విముక్తి కలిగించాలని అధికారుల్ని వేడుకుంటున్నారు.