Bhadrachalam :భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటి మట్టం.. మూడో హెచ్చరికకు చేరువలో గోదారి..

Bhadrachalam : తెలంగాణతో ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో సాయంత్రం గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ సూచించారు.