మద్యం ప్రియులు ఎంతో ఇష్టంగా తాగే పానీయంలో బీరు కూడా ఒకటి. చాలా మంది సాయంత్రం వల్ల చల్లచల్లటి బీరు తాగుతూ..సేద తీరుతుంటారు. ఐతే అలాంటి బీరు సీసాలో తేలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. (Image: Twitter)
2/ 6
జనగామ జిల్లా నర్మెట మండలం కేంద్రంలో మంగళవారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. కన్నెబోయిన కరుణాకర్, మరో వ్యక్తితో కలిసి మండల కేంద్రంలోని తిరుమల వైన్స్‌కు వెళ్లాడు. అక్కడ రెండు బీరు సీసాలు కొన్నాడు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
పక్కనే ఉన్న హోటల్‌కి వెళ్లి.. బీరు సీసాలను ఓపెన్ చేసి గ్లాసులో పోసుకున్నారు. కరుణాకర్ కొద్దిగా బీరు తాగగానే.. అందులో నుంచి దుర్వాసన వచ్చింది. ఇదేంటని అతడు షాక్ తిన్నాడు. బీరు బాటిల్‌ను పరిశీలించి చూడగా.. అందులో తేలు కనిపించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
బీరు బాటిల్లో తేలు కనిపించడంతో కరుణాకర్‌తో పాటు అక్కడున్న వారు ఖంగుతిన్నారు. బీరు సీసాను తీసుకుని వైన్ షాపు యజమాని వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. తమకు సంబంధం లేదని.. ఏం చేసుకుంటావో చూసుకొమ్మని.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని.. కరుణాకర్ వాపోయాడు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఆ తర్వాత అక్కడున్న వారితో కలిసి మద్యం షాపు ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ విషయమై కొందరు వ్యక్తులు ఎక్సైజ్ అధికారులతో మాట్లాడేందుకు ఫోన్ చేసేశారు. కానీ అవతలి నుంచి ఎవరూ స్పందించలేదని సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన మద్యం ప్రియులు.. వైన్ షాప్‌ను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు వైన్ షాప్ నిర్వాహకులను ఆరా తీశారు. ఆ బీరు సీసాలో తేలు ఎలా వచ్చిందో తెలియదని.. ఇందులో తమ తప్పేమీ లేదని స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)