సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) చర్యలు చేపడుతున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు లేకుండా.. సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని శుభవార్త చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లే.. అన్ని ప్రధాన మార్గాల్లోని టోల్ ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్లను కేటాయించాలని కోరుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI), తెలంగాణ ఆర్ అండ్ బీ విభాగాలకు టీఎస్ఆర్టీసీ లేఖలు రాసింది. ఇదే అంశంపై టోల్ ప్లాజా నిర్వాహకులనూ సంప్రదించింది. (ప్రతీకాత్మక చిత్రం)
రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్-విజయవాడ మార్గంలోని పతంగి, కోర్లపహాడ్, హైదరాబాద్-వరంగల్ మార్గంలోని గూడురు, హైదరాబాద్-సిద్దిపేట మార్గంలోని దుద్దేడ, హైదరాబాద్-నిజామాబాద్ మార్గంలోని మనోహరబాద్, హైదరాబాద్-కర్నూలు మార్గంలోని రాయికల్ టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. (ప్రతీకాత్మకచిత్రం)
సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌లోని బస్ భవన్, ఎంజీబీఎస్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రద్దీ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పడు ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)