ఎండల తీవ్రతల కారణంగానే మద్యం అమ్మకాలు పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. కరెంటు కోతలు లేకపోవటంతో రాష్ట్రంలో చిల్డ్ బీర్లు దొరుకుతున్నాయి. దీంతో విస్కీ, బ్రాందీ, ఇతర మద్యం కంటే ఎక్కువ మంది బీర్‌ను ఎంచుకోవటం వల్ల బీర్ల అమ్మకాలు పెరుగుతున్నట్టు మద్యం దుకాణాల నిర్వాహకులు చెప్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో ప్రస్తుతం భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండ భగభగమంటూ ఉక్కపోతతో ప్రజలను ఇబ్బంది పెడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈరోజు, రేపు(శని-ఆది వారాలు) తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)