Rythu Bandhu : వినూత్న రీతిలో రైతుబంధు సంబరాలు.. వాళ్లు ఏం చేశారంటే...?
Rythu Bandhu : రైతుబంధు సాయం ప్రారంభమై నాలుగు సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు,టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు చేపట్టారు. అయితే ఈ సంబరాల్లో బాగంగా సీఎం కేసిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేయడం, పాలభిషేకాలు ఎక్కువగా కొనసాగిస్తున్నారు.
జిల్లా రైతులు, పార్టీ కార్యకర్తలు మాత్రం వినూత్నంగా తమ సంబరాన్ని తెలిజేశారు. అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రైతుబంధు నిధులు తమ ఖాతాల్లో పడడంతో రైతుకు పంట పెట్టుబడిపై భరోసా కల్గుతోంది.
2/ 6
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గంలో సంబురాలు ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు
3/ 6
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డౌలే లక్ష్మి ప్రసన్న - సాయికిరణ్ నేతృత్వంలో మిర్చి పంటతో "జై రైతు బంధు కెసీఆర్" అని ఆకారాన్ని రూపొందించారు.
4/ 6
రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో మహిళలు రైతు బంధు అంటూ ముగ్గులు వేసి ముగ్ధులయ్యరు.
5/ 6
ఈ సంధర్భంగా ఆ జిల్లా మంత్రి మంత్రి కుమార్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రైతుల్లో భరోసా కలిగిందని అన్నారు. 8వ విడతతో కలిపి ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు ఇచ్చిన డబ్బులు రూ.50 వేల కోట్లకు చేరాయని తెలిపారు.
6/ 6
ఖమ్మం జిల్లాలో 2018 వానకాలం నుంచి ఈ యాసంగి సీజన్ వరకు రైతుల ఖాతాల్లో రూ.2,661 కోట్లు జమ అయ్యాయి. ఈ యాసంగి సీజన్‌కు జిల్లావ్యాప్తంగా మొత్తం 3,16,422 మంది రైతులకు రూ.362.28 కోట్ల రైతుబంధు నిధులు మంజూరయ్యాయి.