ఆర్టీసీ సమ్మె విరమించాలి.. ప్రభుత్వం చర్చలు జరపాలి: హైకోర్టు
ఆర్టీసీ సమ్మె విరమించాలి.. ప్రభుత్వం చర్చలు జరపాలి: హైకోర్టు
tsrtc strike: ఆర్టీసీ కార్మిక సమ్మెపై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఐతే చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని హైకోర్టు అభిప్రాయపడింది. కార్మికులు వెంటనే సమ్మెను విరమించాలని.. అటు ప్రభుత్వం కూడా కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని సూచించింది. ఆర్టీసీకి వెంటనే ఎండీని నియమించాలని ఆదేశించింది.