RTC BUS IN CANAL : వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. కాసేపు బిక్కుబిక్కుమంటూ ప్రయాణికులు
RTC BUS IN CANAL : వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. కాసేపు బిక్కుబిక్కుమంటూ ప్రయాణికులు
RTC BUS IN CANAL : వాగు దాటుతున్న ఆర్టీసీ బస్సు మధ్యలో చిక్కుకుంది. అయితే బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బస్సును బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.
గత రెండు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాగులు, కాలువలు దాటే సమయంలో అనేక మంది గల్లంతవుతున్నారు.
2/ 4
ఈ నేపథ్యంలోనే వరద ఉధృతిలో ఓ ఆర్టీసి బస్సు సైతం చిక్కుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఆర్టీసి బస్సు వాగులో చిక్కుకుంది.
3/ 4
చిక్కుకున్న బస్సు కామారెడ్డి నుండి సిద్దిపేట వైపు 20 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. గంభీరావుపేట మండలంలోని అప్పర్ మానేరు బ్రిడ్జి మధ్యలో ఈ సంఘటన జరిగింది.
4/ 4
కాగా గత కొద్ది రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లోని వాగులు ఉప్పొంతున్నాయి. ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కాలువలు నిండి పొంగి పొర్లుతున్నాయి.దీంతో గత రెండు మూడు రోజులుగా ఆరుగురు ప్రయాణికులు కూడా మృత్యువాత పడ్డారు.