Lockdown Benefits : 67 రోజుల్లో రూ.38 కోట్ల జరిమానాలు.. హైకోర్టుకు నివేదిక ఇచ్చిన డీజీపీ

Lockdown Benefits : లాక్‌డౌన్ సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తే... పోలీసులకు మాత్రం కాసులు కురిపించింది..లాక్‌డౌన్ సమయంలో కఠినంగా వ్యవహరించిన పోలీసులు పెద్ద ఎత్తున జరిమానాలు విధించారు..ఇలా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏకంగా 38 కోట్ల రూపాయలు జరిమానాలు వసూలు చేశారు..ఇందులో ఎక్కువగా మాస్క్ లేకపోవడం, భౌతిక దూరం పాటించపోవడం లాంటీ సంఘటనలతోపాటు లాక్‌డౌన్‌లో అక్రమ మెడికల్ దందాలపై పలు కేసులు పెట్టినట్టు రాష్ట్ర డీజీపీ హైకోర్టుకు వివరించారు.