దక్షిణ భారతదేశంలోనే ఎంతో విశిష్టత కలిగిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం పునఃనిర్మాణం, అభివృద్ధికి సీఎం కేసీఆర్50 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. రూ.22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.బాసరలో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు.
మహంకాళి అమ్మవారి ప్రతిమ వెనుక ప్రాకారం మండంపం, ప్రాకారం లోపల శివాలయ పునః ప్రతిష్ట, దత్తేత్రేయ స్వామివారి స్థల మార్పిడి, నలుదిక్కులా రాజగోపురాలు నిర్మాణం, అనివేటి మండప విస్తరణ, ద్వజ స్తంభం ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలోనే యాగశాల, తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.