హెచ్ఎండీఏ పరిధిలో తొర్రూరు, తుర్కయాంజల్, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడలోని ప్లాట్లతో పాటు మహబూబ్‌నగర్‌లోని అమిస్తాపూర్ లేఅవుట్లో ఒక కమర్షియల్ ప్లాట్‌కు వేలం జరుగనున్నది. చందానగర్, కవాడిపల్లిలోని ఆస్తుల వేలం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో వేలం కొనసాగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
వీటికి సంబంధించి పెండింగ్ అనుమతులు, అభివృద్ధి పనులు వంటి వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను అర్వింద్ కుమార్ ఆదేశించారు. ప్లాట్లు, లేఅవుట్ల వివరాలతోపాలు సైట్ విజిటింగ్, వేలం ప్రక్రియ గురించి సంబంధిత వెబ్సైట్లలో పొందుపరుచాలని, స్థానిక మీడియాకు ప్రకటనలు ఇవ్వాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)