మంత్రి కేటీఆర్ సొంత ఇలాకా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటీఆర్ భారీ బందోబస్తు మధ్య కాన్వాయ్ లో వెళ్తున్నారు.
2/ 7
ఈ క్రమంలో సంజీవయ్య నగర్ లో కేటీఆర్ కాన్వాయ్ కు ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు ఎదురెళ్లారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ ను అడ్డుకున్నారు.
3/ 7
పేపర్ లీకేజీపై నైతికబాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని..అలాగే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
4/ 7
ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు పక్కకు ఈడ్చుకెళ్లారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ ను వెంటాడారు.
5/ 7
ఈ క్రమంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో పోలీసులు కింద పడ్డారు.
6/ 7
చివరకు కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లడంతో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు వదిలిపెట్టారు.
7/ 7
పేపర్ లీక్ పై వస్తున్న ఆరోపణలపై కేటీఆర్ అక్కడి సభలో స్పందించారు. ధర్మపురి అర్వింద్ ది ఫేక్ సర్టిఫికెట్ అని..ఇక బండి సంజయ్, రేవంత్ రెడ్డి జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా అని ప్రశ్నించారు.