తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తర, దక్షిణ ద్రోణి పయనిస్తూ ఉంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. బుధవారం (సెప్టెంబరు 7) తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. (ప్రతీకాత్మక చిత్రం)
రేపు (సెప్టెంబరు 9) కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, మహబూబాబాద్, మల్కాజ్గిరి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, వరంగల్, రంగారెడ్డి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నిర్మల్, నిజామాబాద్ లో అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)