తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ మహానగరంలో ఈ రోజు ఉదయం చిరుజల్లులు పడగా, వాతావరణం చల్లబడింది. మరోవైపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. ఈదురు గాలుల ప్రభావానికి రోడ్లపై చెట్లు కూలిపోయాయి. పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాతపడింది. వేములవాడ రాజన్న సన్నిధిలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఈదురు గాలుల ప్రభావానికి రోడ్లపై చెట్లు కూలిపోయాయి.
2/ 10
వర్షపు నీటితో జలమయమైన రోడ్లు
3/ 10
కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారిలో కొత్తపల్లి వద్ద ఆటోపై చెట్టు కూలడంతో వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
4/ 10
కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారిలో కొత్తపల్లి వద్ద ఆటోపై చెట్టు కూలడంతో వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
5/ 10
జగిత్యాల పట్టణంలో జోరుగా కురిసిన వాన
6/ 10
ఒక్కసారిగా మారిన వాతావరణం.. వాన నీటితో తడిసిన నేల
7/ 10
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వస్తాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు పిట్టల ఎల్లయ్య అనే రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది.
8/ 10
వేములవాడలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో రాజన్న ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి.
9/ 10
వేములవాడలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో రాజన్న ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి.
10/ 10
వర్షపు నీరు ఇంటిలోకి చేరడంతో ఎత్తి బయటకు పారబోస్తున్న మహిళ