తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై బాలకృష్ణ అనే ప్రైవేటు ఉపాధ్యాయులు హైకోర్టు(Telangana High Court)లో ప్రజాప్రయోజన వాజ్యం(PIL) దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో స్కూళ్లను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
ఈ మేరకు స్కూళ్లలో కరోనా నిబంధనలు పాటించాలని, శానిటైజేషన్ చేయాలని ప్రభుత్వం అధికారులను స్థానిక సంస్థలను ఆదేశించింది. దీంతో పాఠశాలల్లో ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
కరోనా ప్రారంభం నాటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని రకాల విద్యాసంస్థలు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
ఏళ్ల పాటు ప్రత్యక్ష తరగతులు జరగకపోతే విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రుల నుంచి సైతం స్కూళ్ల ప్రారంభంపై పెద్దగా వ్యతిరేకత రావడం లేదు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
అయితే స్కూళ్లు సెప్టెంబర్ 1న ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభం అవుతాయని అంతా భావిస్తున్న సమయంలో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమైంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
బాలకృష్ణ అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు రాష్ట్రంలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ క్లాసులు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ఆందోళనకరమని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యక్ష బోధన సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని స్కూళ్లను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని ఆయన కోర్టను కోరారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈ నెల 31న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
అయితే కోర్టు ఈ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
అయితే కోర్టు ఈ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది.(ప్రతీకాత్మక చిత్రం)