ప్రస్తుతం మోదుగ ఆకుతోపాటు తునికి, బాదం, రాగి, అడ్డాకు, పొరటాకులతో కూడా విస్తర్లను తయారు చేస్తున్నారు. ఈ విస్తర్లలో పైన ఆకు కింద కాగితం ఉంటాయి. దీంతో సాధారణ విస్తరి కంటే మందంగా ఉంటుంది. మోదుగ లేక ఇతర ఆకులతో కుట్టిన విస్తర్లను అట్టపై ఉంచి మిషన్ లో వేసి అచ్చు వేస్తుండటంతో అన్ని విస్తరాకులు ఒకే ఆకృతిలో వస్తున్నాయి.
సహా పంక్తి భోజనాలలో కాకుండా బఫే భోజనాలలో వినియోగించుకునేందుకు వీలుగా ఈ విస్తరాకులు ఉన్నాయి. ఇలా తయారు చేసిన విస్తర్లను మంచిర్యాల, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్ తదితర జిల్లాలకు పంపిస్తోంది. తన విస్తర్ల తయారీ కేంద్రాన్ని మరింత విస్తరించి ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఉపాధి కల్పించాలన్నదే తన లక్ష్యమని శ్రీలత న్యూస్ 18 తెలుగు కు వివరించింది.