Lockdown : డీజీపీ ఆదేశాలతో రోడ్లపైకి జిల్లా ఎస్పీలు, కమీషనర్లు

Lockdown : తెలంగాణలో లాక్డౌన్‌ను నిబంధనలను పకడ్బంధిగా అమలు చేయాలంటూ రాష్ట్ర డిజీపీ ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేశారు. ఆయా జిల్లాల్లో ఎస్పీలు, కమీషనర్‌లు ఉదయమే రోడ్డు మీదకు వచ్చి నిబంధనలకు విరుద్దంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలో నేడు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.