సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నారు. త్వరలోనే తేదీని ఖరారు చేస్తారు. ఐతే ఈ రైలును ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సమయం కేటాయించాలని ప్రధానిని మోదీని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
2022లో ప్రధాని మోదీ నాలుగు సార్లు తెలంగాణలో పరర్యటించినా.. సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ఆయన్ను కలవలేదు. కనీసం స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టుకు కూడా వెళ్లలేదు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం తారా స్థాయికి చేరడంతో... ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ కొంతకాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే ఆయన కార్యక్రమాలకు హాజరుకావడం లేదు.