ఫొటోగ్రఫీ అనేది మగవాళ్లకు మాత్రమే అన్న అపోహను తొలగిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం 8వ కాలనీకి చెందిన తులసి అమ్మాయిలు తలచుకుని ధైర్యంగా ఓ అడుగు ముందుకేస్తే ఏ రంగంలోనైన రాణిస్తారని నిరూపించారు. గత పదేళ్లుగా ఫోటోగ్రఫీ రంగాన్ని నమ్ముకొని..అందులోనే తన కంటు ఓ ప్రత్యేకమైన ముద్రవేసుకుంది.
ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఎంచుకున్న తులసి చదువుల్లో కూడా తగ్గేదేలే అని నిరూపించుకున్నారు. పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ లో మల్టీమీడియా పూర్తి చేశారు. తర్వాత కొన్ని రోజులు కాలేజీల్లో పాఠాలు చెప్పారు. తండ్రి ఆరోగ్య తండ్రి డీవీఆర్ అనారోగ్య పరిస్థితుల వల్ల ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు మొదలవడంతో తులసి మళ్లీ కెమెరా పట్టుకోవాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతను తన భుజస్కందాలపై ఎత్తుకోవాల్సి వచ్చింది.
ఆడపిల్లగా ఎవరూ చేయని సాహసం చేసిన తులసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ఫొటో గ్రాఫర్ అవార్డు అందుకోవడాన్ని తన తొలి విజయంగా భావిస్తారు. ఆ తర్వాత నిజామాబాద్‌లో GR మెమరీ ట్రస్ట్ వారిచే బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆకాంక్ష ట్రస్ట్ వారు నిర్వహించిన అవార్డులో ధాత్రి అవార్డ్ సొంతం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన ఫొటో ఎక్స్‌పోలో ఎన్నో అవార్డులపై తులసి తన పేరు ఉండేలా ఎదిగారు. ఎదగాలన్న ఆలోచన..నచ్చన రంగాన్ని ఎంచుకోవడంలోనే ప్రతి ఒక్కరు సగం సక్సెస్ అవుతారని..ఆ ఫీల్డ్‌లో నిబద్దతతో పాటు సొంత క్రియేటివిటీని ప్రదర్శిస్తే ఎంతటి లక్ష్యాన్నైనా అలవోక సాధిస్తామని తోటి అమ్మాయిలకు సూచిస్తున్నారు తులసి.